చదువే పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి:డిఎస్పీ

మీరు పడే శ్రమ,చదివే చదువే మీ భవిష్యత్తుకు పెట్టుబడి అని,కసిగా చదివి ప్రతీ ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కెరీర్ లో ఇంటర్ మిడిల్ అని ఇంటర్ ఉత్తీర్ణులు అయితే మీ భవిష్యత్తుకు రాచబాట పడుతుందని అన్నారు.

 Investing In The Future Of Students: Dsp-TeluguStop.com

ఇంటర్ అనంతరం దోస్తులో మీరు కోరుకున్న కళాశాలలో సీటు రావాలంటే వారు కోరుకున్న విధంగా మీ మార్కులు ఉండాలని అన్నారు.ప్రస్తుతం కెరీర్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా కెరీర్లో భాగమేనన్నారు.

జీవితంలో స్వయం సమృద్ధిగా నలుగురికి ఉపాధి కల్పించేలా ఉండాలని సూచించారు.సెల్ ఫోన్ తో సమయం వృధా చేస్తున్నారని స్మార్ట్ ఫోన్ లెక్క మీ జీవితాన్ని అందంగా మలుచుకోవాలన్నారు.

మీరు మీ జీవితంలో చిన్న పెట్టి కేసులో పేరు వచ్చిన భవిష్యత్తు చెడిపోతుందని ముఖ్యంగా సెల్ఫోన్ సోషల్ మీడియా మెసేజ్ లకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ గల అధ్యాపకులు ఉన్నారని వారి సేవలను వినియోగించుకొని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నారు.

అనంతరం విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి జానపాటి కృష్ణయ్య,కళాశాల ప్రిన్సిపాల్ పేరుమాండ్ల యాదయ్య,వార్డు కౌన్సిలర్ తాహెర్ పాష,వైస్ ప్రిన్సిపల్ మద్దిమడుగు సైదులు,అధ్యాపకులు లింగం,కవిత,కంది శ్రీను, బాల్తు శ్రీనివాస్,జి.

శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube