మైనారిటీ ప్రజలను మభ్య పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం

కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, రెండు నెలల క్రితం ఇంటర్యూలు జరిగిన మైనారిటీ కార్పొరేషన్ లోన్లు ఇస్తారా లేదా అని గురువారం భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ లో పాలకమండలిని,అధికారులను ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు నిలదీశారు.మైనార్టీ కార్పొరేషన్ నుండి మంజూరైన నాలుగు లోన్లకు నాలుగు వందల అప్లికేషన్ వచ్చాయని, దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారని,అయినాఇప్పటి వరకూ అతీగతీ లేదని వాపోయారు.

 Muslim Minority Counsellors Fires On Cm Kcr Over Minority Corporation Loans,musl-TeluguStop.com

అప్లికేషన్ చేసుకున్న లోన్లు ఎప్పుడు వస్తాయని పేద ముస్లింలు ఎదురు చూస్తున్నారని,అసలు వస్తాయా లేదా అని అయోమయంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.మైనార్టీ కార్పొరేషన్ లోన్ల పేరుతో మైనార్టీలను కేసీఆర్ ప్రభుత్వం మభ్య పెడుతుందని,దీనికి సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube