సూర్యాపేట జిల్లా: ఈ నెల 27న జరగబోయే నల్లగొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఆదివారం రాత్రి హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తీసుకురావాలన్నారు.
అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ హక్కులను కాలరాసే కుట్ర జరుగుతుందన్నారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలకు అన్యాయం చేసే బీజేపీని ఓడించాలన్నారు.2014లో కేసీఆర్,మోడీకీ రాష్ట్రాన్ని, దేశాన్ని అప్పజెప్తే వారి పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉసురు పోసుకొని, నిరుద్యోగులను నట్టేటముంచి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ 317,46 జీవోలను తీసుకువచ్చి
పేద ప్రజల కన్నీళ్ళకు కారణమైయ్యారని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు.
చేతగాక నడిమెట్ల వదిలిపోతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు,ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా పనిచేస్తుందని,పట్టభద్రులందరూ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కోదాడ,తుంగతుర్తి ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడగా,భారీ సంఖ్యలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు.