రైతులకు రూ.లక్ష రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలి

సూర్యాపేట జిల్లా:కేసీఆర్ రైతులకు( CM KCR ) ఇచ్చిన రైతు రుణమాఫీని ఏక కాలంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం పాలకవీడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా( Suryapet District ) కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు హామీలను ఇస్తూ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.

 A Loan Waiver Of Rs.1 Lakh For Farmers Should Be Implemented Simultaneously-TeluguStop.com

విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అది కూడా అమలు కావడం లేదని,రుణమాఫీ అమలు కాకపోవటం వల్ల రైతులపై తీవ్ర వడ్డీ భారం పడుతుందని,కొన్ని బ్యాంకుల్లో రైతుబంధు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయలు లోపు రుణమున్న రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేని యెడల రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.అనంతరం స్థానిక తాహాసిల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్,పిఎసిఎస్ వైఎస్ చైర్మన్ పగడాల మల్లేష్( Mallesh ),రైతు నాయకులు ఎర్రడ్ల మల్లారెడ్డి,ఆర్లపూడి వీరభద్రం,గుర్రం ధనమూర్తి,మాతంగి ఏసురత్నం,మాజీ సర్పంచ్ మీసాల కాశయ్య,కొండా పెద్ద ఎల్లయ్య,కీసర మల్లయ్య,చాపల మల్లయ్య,రైతులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube