విద్యుత్ చార్జీల పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి ఇరవై శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంచడమంటే దేశ ఆర్థికాభివృద్ధికి ద్రోహం చేయడమేనన్నారు.

 Increase In Electricity Charges Is Cheating People: Minister Jagadish Reddy , El-TeluguStop.com

పీకేలోడ్ అవర్స్ చార్జీల పెంపకం ప్రగతిశీల నిర్ణయం కాదని,విద్యుత్ చార్జీల భారం మోపడమంటే దేశ ప్రగతికి అడ్డుకోవడమేనన్నారు.తాము కేంద్ర నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని,పేదలపై భారం వేయడాన్ని అడ్డుకుంటామన్నారు.

ఇప్పటికే ట్రూ అప్ చార్జీల భారం రాష్ట్రం మోస్తుందన్నారు.ప్రజలపై భారం వేసే ఏ చర్యలకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఉండదన్నారు.

దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసే కుట్ర కేంద్రం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

కార్పొరేట్ల కు లాభం కోసమే మోడీ పరిపాలన నడుస్తుందని, 2014 ముందు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న కేంద్రం, నేడు సాధారణ ప్రజలకు విద్యుత్ ని దూరం చేస్తుందన్నారు.కేంద్రం వ్యాపారాలు చేయమంటూనే బడా వ్యాపారుల కోసమే పనిచేస్తుందన్నారు.

ప్రజల జీవితాలతో విద్యుత్ మమేకమైన నేపథ్యంలో పేద ప్రజలకు విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందన్నారు.

గతంలోనూ వారు చెప్పిన విధంగా మీటర్లు బిగించడానికి ఒప్పుకోలేదని,తెలంగాణ విద్యుత్ పై కుట్రలు చేసి రుణాలు రాకుండా అడ్డుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్ర నిర్ణయంతో అంతిమంగా పేద ప్రజలపైనే భారం పడుతుందన్నారు.ఇప్పటికే గ్యాస్,డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వానికి,ఇపుడు విద్యుత్ చార్జీల పెంపకం నిర్ణయం మంచిది కాదన్నారు.

మోడీ దుర్మార్గపు,పాపపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.పేదలు మరింత పేదలుగా మారేలా మోడీ పాలన సాగుతుందన్నారు.

తెలంగాణా ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే,కేంద్రం ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం వేస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజా క్షేత్రంలోనే తీల్చుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube