టిఎస్పిఎస్ నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలని టి సేవ్ లో భాగంగా వైఎస్సార్ టిపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో ఒక వైపు రైతులు, మహిళలు,సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇది చాలదన్నట్లు మరోవైపు టిఎస్పిఎస్సి పేపర్,టెన్త్ పీఆర్ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల,విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియంతృత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.టిఎస్పిఎస్సి పేపర్ లీక్ స్కాం వలన అనేక మంది నిరుద్యోల తమ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా చేశాడని అకాల వర్షాలు పడి పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పేరుకే పైపైన పంటనష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు.
పరిహారం కోసం అన్నదాతలకు ఎదురు చూపులే దిక్కైనాయని అన్నారు.అలాగే ప్రజాసమస్యలపై ఎవరైనా గొంతెత్తి నిరసనలు తెలిపితే అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని,ఇలాంటి పరిస్థితులు పోవాలంటే ఖచ్చితంగా వైఎస్సార్ టిపి ని బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు.దాని కోసం ఎటువంటి ఇబ్బందులు ఎదురైన ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉండాలన్నారు.