పీసీ,ఎస్ఐ ఉద్యోగాలకు సిద్దమౌతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్,కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉండడంతో జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.పేద నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న పేద నిరుద్యోగ యువతీ,యువకులకు ముందస్తు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేశారు.

 Preliminary Training For Unemployed Candidates Preparing For Pc, Si Jobs-TeluguStop.com

దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు శారీరక,దేహదారుఢ్య అర్హత పరీక్షలు నిర్వహించారు.

నోడల్ అధికారితో నిత్యం పర్యవేక్షణ చేస్తూ అర్హత పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉచిత శిక్షణ ఎంపిక పరీక్షలు ఉత్సాహంగా సాగాయని,మహిళ అభ్యర్థుల్లో మరింత ఉత్సాహం కనిపించిందని,పేద నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమన్నారు.

పిజికల్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నెల 13 న అర్హత రాతపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్, స్నేహపూర్వక పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగ పేద యువతీయువకులకు అవకాశం కల్పిస్తూ జిల్లా పోలీసు అధ్వర్యంలో ముందస్తుగా ఉచిత శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించి,అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు తీసుకోవడం జరిగినదని తెలిపారు.

దీనిలో భాగంగానే ఈరోజు దేహదారుఢ్య అర్హత పరీక్షల్లో ఎత్తు,ఛాతీ,పరుగు పందాలు నిర్వహించామన్నారు.పురుషులకు 800 మీటర్ల పరుగు, మహిళలకు 100 మీటర్ల పరుగు నిర్వహించామని,ఈ అవకాశాన్ని 522 మంది సద్వినియోగం చేసుకున్నారని అన్నారు.

దీనిలో 113 మంది యువతులు,409 మంది యువకులు ఉన్నారని,మొత్తంగా 392 మంది అర్హత సాధించగా ఇందులో 108 మంది యువతులు,284 మంది యువకులు ఉన్నారని తెలిపారు.అర్హత పొందిన అభ్యర్థులకు ఈనెల 13 వ తేదిన జిల్లా కేంద్రంలోని ఎస్.వి.డిగ్రీ కళాశాల నందు స్క్రీనింగ్ రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు.ఫిజికల్ టెస్ట్ నందు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష కోసం వెంటనే హాల్ టికెట్స్ అందించామని,హాల్ టికెట్ పై ఉన్న సమచారం ఆధారంగా రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.అర్హత పొందిన వారికి తదుపరి ఉచిత శిక్షణ ఉంటుందని ప్రకటించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు పిజీకల్ పరీక్షలను జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్ పర్యవేక్షణ చేయగా,ఈ పరీక్షల్లో కోదాడ డిఎస్పీ రఘు,ఉచిత శిక్షణ నోడల్ అధికారి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐలు శ్రీనివాస్,నర్సింహారావు,గోవిందరావు,ఎస్ఐలు, సిబ్బంది,అభ్యర్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube