అక్రమ సంపాదనతో ప్రశ్నించే వారిపై దాడులు...!

సూర్యాపేట జిల్లా: ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలోని దళితులపై వరుస దాడులు చేయిస్తున్న గాదరి కిషోర్ కు రాబోయే ఎన్నికల్లో దళితులు తగిన బుద్ది చెప్పడం ఖాయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే అనుచరులు అడ్వకేట్ పర్రేపాటి యుగంధర్ పై చేసిన దాడికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

 Attacks On Questioning Illegal Earnings, Suryapet , Mla Gadari Kishore, Congres-TeluguStop.com

నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్ష నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక దందా ద్వారా వేల కోట్ల ఆస్తులు అడ్డగోలుగా సంపాదించి,అధికార మదంతో ప్రశ్నించే నాయకుల మీద దాడులు చేయడం హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుడైన ఎమ్మెల్యే సాటి దళితులకు దక్కాల్సిన దళిత బంధు పైసలల్లో కూడా కమీషన్ తీసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.ఈ సారి ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు గాదరికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube