ఎన్నికల స్టంట్ బందరు పోర్ట్ - కొల్లు రవీంద్ర

బందరు పోర్ట్ శంకుస్థాపన పై టీడీపీ లీడర్ కొల్లు కామెంట్స్ : పేర్ని నాని వీడుకోలు సభ, కొడుకు ప్రమోషన్ పోర్ట్ పేరుతో కానిచ్చాడు.పోర్ట్ గురించి మాట్లాడే అర్హత కూడా జగన్ కు, పేర్ని నాని కి లేదు.

 Tdp Leader Kollu Ravindra Shocking Comments On Bandar Port, Tdp ,kollu Ravindra,-TeluguStop.com

రాజశేఖర్ రెడ్డి బందరు పోర్టును గోగులేరుకు తరలిస్తే దానికి ఎలాంటి అభ్యన్తరం లేదని సంతకం పెట్టిన పేర్ని నాని ఇప్పుడు పోర్ట్ పేరెత్తడానికి ఎం అర్హత వుంది.ముగ్గురు ముఖ్యమంత్రులతో ఎన్నికలప్పుడే పేర్ని నానికి పోర్ట్ గుర్తుకు వస్తుంది.

కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అదే కాంట్రాక్టర్ తో మేము పనులు చేయించాం.పేర్ని నాని ఆ కాంట్రాక్టర్ ను కాదని పనులు ఆపేసాడు.

పోర్ట్ మీద ఏవరికీ చిత్త శుద్ధి వుంది ప్రజలు ఆలోచించు కోవాలి.మేము పోర్ట్ నిర్మాణం చేస్తుంటే ఇదే జగన్ మోహన్ రెడ్డి 2 సార్లు బందర్ వచ్చి రైతులను రెచ్చ గొట్టి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.జగన్ శంకుస్థాపన చేసిన పోర్ట్ వలన బందరుకు ఎటువంటి ప్రయోజనం లేదు.24 బెర్తులకు 5 వేల కోట్లతో నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే, ఇప్పుడు 4 బెర్తులకే 5,500 కోట్లు ఖర్చు అంటున్నారు.ఇది పోర్టుకు తక్కువ హార్బర్కు ఎక్కువ.ఈ ప్రభుత్వం జీతాలకే డబ్బులు లేవని చేతులు ఎత్తేసింది ఇంకా అప్పు చేసి పోర్ట్ నిర్మానం చేస్తారా .

రూపాయీ ఖర్చు లేకుండా పోర్ట్ నిర్మాణం, ఇండస్ట్రీస్, పోర్ట్ సిటీ, పోర్ట్ ఆపరేటింగ్ అన్ని ఫ్రీగా చేసే ఏర్పటు చంద్రబాబు గారు చేస్తే దాన్ని కాదని అప్పుచేసి పోర్ట్ కడతాం అంటే ఎవరు నమ్మే వారు లేరు.పాదయాత్ర అప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏ కార్యక్రమం చేపట్టిన అది ఎన్నికల ఓట్లు కోసమే అని చెప్పి ఈ రోజు ఎలా బందరు పోర్ట్ శంకుస్థాపన చేసాడు.

భావన పాడు, రామయ్య పట్నం, మచిలీపట్టణం పోర్ట్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి లోన్ తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుకోవడం తప్ప దీని వళ్ళ ఒక్క పోర్ట్ కూడా నిర్మించ లేరు.హార్బర్ గురించి అవగాహనా లేకుండా మాట్లాడు తున్నారు.

చంద్రబాబు గారి హయాంలోనే హార్బర్కు 250 కోట్లతో టెండర్లు పిలిచారు, అదే హార్బర్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం 550 కోట్లు అని నిర్మాణ వ్యయం పెంచేశారు.దీంట్లో 200 కోట్లు కమిషన్ కొట్టేసారు.

కాంట్రాక్టు కూడా వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడికి ఇచ్చారు.మెడికల్ కాలేజీ విషయంలో ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పాడు.

మెడికల్ కాలేజీ తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉండగానే తీరప్రాంత ప్రజలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు దీనికోసం మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయాలనీ నాడు కేంద్రానికి లేఖ రాసి అనుమతులు పొందడం జరిగింది.ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడితే రాష్ట్ర ప్రభుత్వం అందులో కొంత చెల్లించాలి కానీ మొత్తం వీళ్ళే చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు.

ఇళ్ల స్థలాలు సంబంధించి గ్రామాల్లో కేవలం పాతిక, ముప్పై వేళలలో సెంటు స్థలం సేకరించి దానికి ప్రభుత్వం ద్వారా ఐదు లక్షలు తీసుకుని ప్రజలను, ప్రజా ధనాన్ని దోపిడీ చేసారు.

ఎన్.

ఆర్.ఈ.జి.ఎస్. క్రింద పనులు చేసి ఈ డబ్బు దోచేశారు.ఆ అధికారులను కాపాడేందుకు వారికీ ట్రాన్స్ఫర్ వచ్చిన అడ్డుపడుతూన్నాడు.

గోల్డ్ కవరింగ్ వ్యవస్థకు నాడు బ్రాహ్మణయ్య గారు సమయంలోనే వారికీ టాక్స్ లు లేకుండా చేసాడు.నా హయాంలో కరెంటు సబ్సిడీకి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది.ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది.అమరావతి భూముల విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి మోసం చేస్తుంది.

ఇప్పుడు ఇళ్ల స్థల పేరుతో సామాన్య ప్రజలను రెచ్చ గొట్టి వారిని కూడా మోసం చేస్తుంది.ఒక పక్క కోర్టులో ఉండగానే ప్రజలు రెచ్చ గొట్టి మోసం చేస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తుంది.

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా వారు ఇచ్చిన భూములను నువ్వు ఎలా దారాదత్తం చేస్తావు, మీ ఆస్తుల అవి అని ప్రశ్నిస్తున్న.వున్నా ఇల్లు ఇవ్వడానికి పేర్ని నానికి మనసు రాదు కానీ బందరులో వున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తా అంటున్నాడు.

చిట్టా శుద్ధి ఉంటే మేము నిర్మించిన టి డ్ కో ఇళ్లకు పేద జలకు పంపిణి చేసి చిట్టా శుద్ధి నిరూపించుకో.ఇప్పటికే సి.ఆర్.జడ్.పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి కోర్టులో కలెక్టర్ చివాట్లు తింన్నారు, ఇప్పుడు మల్లి అదే డ్రామాలు ఆడుతూ సి.ఆర్.జడ్.భూములలో వున్నా వారికీ పట్టా ఇష్టం అని మోసం చేస్తున్నాడు.గత ఎన్నికలప్పుడు ఇంటికో పట్టా అని పేపర్లు ఇచ్చి మోసం చేసాడు, ఇప్పుడు అదే విధంగా ఇంటికో భూములు అని మోసం చేస్తున్నాడు పేర్ని నాని. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చెప్పినట్లు మేజర్ పోర్ట్ నిర్మాణం చేస్తాం, 24 బెర్తులు నిర్మించి బందర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తాం.

గోల్డ్ కవరింగ్ వారికీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటాం.వైసీపీ లాగ ఊరికి బయట, గుంతల్లో సెంటు భూమి కాకుండా, నివాస యోగ్యమైన చోటే రెండు సెంట్ల స్థలం తో పటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube