సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలంలో శనివారం ఉదయం అబ్బిరెడ్డిగూడెం రోడ్ వైపు నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యం రవాణా జరుగుతున్నదని నమ్మదగిన సమాచారం మేరకు అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా 5 గంటల సమయంలో ఒక అశోక్ లే లాండ్ నెంబర్ TS05UC7414 అనుమానాస్పదంగా రాగా వెంటనే అట్టి వాహనాన్ని పట్టుకొని వాహన డ్రైవరును అదుపులోకి తీసుకోగా తన పేరు చిలకరాజు రాంబాబు తండ్రి కోటయ్య అని,గత కొన్నాళ్లుగా పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పిండిప్రోలు పర్వతాలు వాహనంపై పిడిఎస్ బియ్యం(PDS rice ) రవాణా చేయుటకు డ్రైవరుగా పని చేస్తున్ననని,తన యజమాని పర్వతాలు ఆదేశానుసారం గూగులోతు రామును కలవగా అతను సర్వారం మరియు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజా పంపిణీ బియ్యం తక్కువ రేట్ కు కొని తమ మాయజమాని పర్వతాలుకు అమ్ముతుంటాడని తెలిపాడని ఎస్ఐ.ఇ సైదులు తెలిపారు.
ఈ రోజు కూడా వెళ్ళి గూగులోతు రాము దగ్గర మా యొక్క వాహనంలో పిడిఎస్ బియ్యం లోడ్ తీసుకొని మిర్యాలగూడకు వెళుతుతున్నట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు.పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా( PDS Ration Illegal transport ) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.