సూర్యాపేట జిల్లా:రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం బలమేంటో చూపిస్తామని టీడీపీ సీనియర్ నాయకులు పాల్వాయి రమేష్ అన్నారు.బుధవారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో నిర్వహించిన స్వర్గీయ ఎన్టీఆర్ 27వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరైనారు.
ముందుగా పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రధాన కూడళ్ళ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కీలకం కానుందన్నారు.ఇక్కడనారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను సాధిస్తూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఇంజమూరి వెంకటయ్య, పొనుగోటి జంగయ్య, నాగేశ్వరరావు, రామచంద్రయ్య,యడవెల్లి వెంకటరెడ్డి,పచ్చిపాల వెంకన్న యాదవ్, సైదాచారి తదితరులు పాల్గొన్నారు.