బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యిందని బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడారు.
అయ్యా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు 420 హామీలు చెప్పి గద్దెనెక్కి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు 4000 పెన్షన్, మహిళలకు 2500 పెన్షన్, 500 రూపాయలు వరికి బోనస్, యువతులకు స్కూటీలు, రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఎక్కడ పోయాయని అన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న వాటి ఉసే ఎత్తడం లేదన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని,ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని అన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తుందని,గురుకులాలను పట్టించుకున్న నాథుడు కరువయ్యారని ఆయన తీవ్రంగా మండి పడ్డారు.
వీటన్నిటిని ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు నిలదీస్తు ఉంటే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.అలాంటి ఆలోచనలు మానుకొని ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చిన పథకాలు అమలయ్యేదాకా ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్, శ్రీకాంత్, వెంకటేష్, రాజు, అక్రమ్ ,లక్ష్మణ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
.