రాహుల్ గాంధీ పై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్...

సూర్యాపేట జిల్లా: రాహుల్ లీడర్ కాదు రీడర్ అని,రెండు సార్లు ఏఐసిసి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని,రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని అని,నిన్నా,మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారని,భాజపాకు బీఆర్ఎస్ రిశ్తేదార్ కాదని,రాహులే మోడీకి గుత్తేదారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైరయ్యారు.సోమవారం హైదరబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారని,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంతని,ఫించన్ ప్ల కార్డులు రాహుల్ తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా అని ఎద్దేవా చేశారు.

 Minister Jagadish Reddy Fires On Rahul Gandhi, Minister Jagadish Reddy , Rahul G-TeluguStop.com

నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదని,కాంగ్రెస్ పార్టీని కోనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలేనని,

అదే రాష్ట్రంలో వికలాంగులకు 500,వితతంతువులకు ఇచ్చేది 350 నని గుర్తు చేశారు.అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్దులకు ఇచ్చేది 750,వికలాంగులకు 750, వితంతువులకు 550 మాత్రమే సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదన్నారు.

కర్ణాటకలో వృద్దులకు 800, విజలాంగులకు 800, వితంతువులకు 800 రూపాయలేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో,కోన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో, పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో 4,000 ఫించన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుందన్నారు.గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారని,

అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారన్నదే హాస్యాస్పదంగా మారిందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.4,000 ఫించన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మశక్యంగా లేదని,ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు 4,000,వితంతువులకు 2016,వృద్దులకు 2,016 ఇస్తున్నారని తెలిపారు.కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో,కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందన్నారు.కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube