వర్షాకాలం( rainy season ) అంటేనే వ్యాధులకు కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు.అది అక్షరాల నిజం.
అలాంటి వ్యాధుల కాలంలోకి రానే వచ్చాము.ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ ఉండాలి.
లేకుంటే వ్యాధుల బారిన పడినట్టే.ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు వంటివి ముందు వరుసలో ఉంటాయి.
వర్షంలో అలా తడిచామంటే చాలు జలుబు పట్టుకుంటుంది.దాని వెంటే నేనున్నానంటూ దగ్గు కూడా మొదలవుతుంది.
ఇవి చిన్న సమస్యలే అయినప్పటికీ వీటి వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
చేసే పనిపై ఏకాగ్రత ఉండదు.
పైగా జలుబు దగ్గు( Cold cough ) వల్ల రాత్రుళ్లు సరైన నిద్ర కూడా పట్టదు.అయితే జలుబు దగ్గు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు డ్రింక్స్ అద్భుతంగా సహాయపడతాయి.ఇవి మీ డైట్ లో ఉంటే ప్రస్తుత వర్షాకాలంలో జలుబు దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు.
మరి ఆ డ్రింక్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలు.వర్షాకాలంలో మన ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.పావు టేబుల్ స్పూన్ పసుపును( turmaric ) ఒక గ్లాసు పాలల్లో వేసి మరిగించి బెల్లం పొడి ( Jaggery powder )కలుపుకుని తీసుకోవాలి.
ఈ విధంగా రోజు చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గుతో సహా ఎన్నో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒకవేళ వచ్చినా వాటి నుంచి చాలా త్వరగా రికవరీ అయిపోతారు.
అలాగే ప్రస్తుత వర్షాకాలంలో డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన మరొక డ్రింక్ తులసి టీ( Basil tea ).దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అందువల్ల రోజుకు ఒక కప్పు తులసి టీ తీసుకుంటే జలుబు, దగ్గు వంటివి వేధించకుండా ఉంటాయి.
అదే సమయంలో విష జ్వరాల నుంచి సైతం రక్షణ లభిస్తుంది.ఇక దాల్చిన చెక్క టీ కూడా ప్రస్తుత వర్షాకాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీ తీసుకుంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒకవేళ జలుబు దగ్గు ఉన్న సరే వాటి నుంచి త్వరగా రిలీఫ్ పొందుతారు.
మలేరియా, డెంగ్యూ రోగులకు కూడా దాల్చిన చెక్క టీ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.