సూర్యాపేట జిల్లా:ఈసారి తుంగతుర్తి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇవ్వాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామెల్ కోరారు.శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తుంగతుర్తి ప్రాంత వ్యక్తిగా ఉన్నప్పటికి,పోటీ చేసే అవకాశం రాకపోయినా టిఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేశానని,పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తిని నేనేనని,మొదటి నుండి కేసీఆర్ వెంట నడిచానని,తెలంగాణ కోసం అనేక కార్యక్రమాలు,పోరాటాలు నిర్వహించానని తెలిపారు.2014 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం నుండి 40 మంది సర్పంచులను గెలిపించి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశానని గుర్తు చేశారు.తన హాయంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ను నియోజకవర్గానికి రెండుసార్లు తీసుకొచ్చానని,తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు తననే ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారని, కెసిఆర్ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తనకి టికెట్ కేటాయించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




Latest Suryapet News