సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ డిమాండ్ చేశారు.హుజూర్ నగర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగడునా దళిత జాతిని అవమానిస్తున్నారని,దళిత సీఎం దగ్గర నుండి నిన్నటి కొప్పుల ఈశ్వర్ ఘటన వరకు అవమానాలేనని మండిపడ్డారు.
దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అవమానించడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ కి రాబోయే రోజుల్లో దళితులు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.కేసీఆర్ కి దళితులు అంటే ఎంత చిన్న చూపో తన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తన పార్టీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘటనే నిదర్శనమని అన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినందు తన పక్కన కూర్చోటానికి కూడా నిరాకరించాడని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారని, తెలంగాణ రాష్ట్రంలో నుండి టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.