సూర్యా పేట జిల్లా:తాను పుట్టి నడయాడిన గడ్డమీద తన మొదటి చిత్రం ఆకాశ వీధుల్లో సినిమా పాటను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ చిత్రం హీరో గౌతమ్ కృష్ణ తెలిపారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూడో వార్డు బీబీగూడెంకు చెందిన గౌతమ్ కృష్ణ తాను నటిస్తున్న ఆకాశ వీధుల్లో సినిమా నరనరమున పాటను చిత్ర హీరోయిన్ పూజిత పొన్నాలతో కలిసి శనివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల నడుమ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించాలని,తన మొదటి చిత్రానికి అన్నీ తానై అద్భుతంగా తీర్చి దిద్దుతున్నానని,త్వరలోనే మీ ముందుకు తెస్తామన్నారు.అభిమానులు చిన్న చిత్రాలని కొట్టి పారేయకుండా,తన చిత్రాన్ని ఆదరించాలి అన్నారు.
తనకు ఈ చిత్రం భవిష్యత్తు అని,నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని అన్నారు.అభిమానులను పాటలు విన్నారా? ఎలా ఉన్నాయి? అని అడుగగా బాగున్నాయి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేసి,పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు,అధ్యాపకులు,సిబ్బంది,చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.