వడ్లు కొనేదాక వదిలేదేలే:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు విజయవాడ- హైదరాబాద్ 65వ, జాతీయ రహదారిపై తెలంగాణ ముఖద్వారం రామపురం ఎక్స్ రోడ్డు వద్ద కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి,జాతీయ రహదారి దిగ్బంధం చేశారు.దీనితో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిపోయాయి.

 Leaving Until The Father-in-law: Trs Mlas-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని అన్నారు.

బిజెపి నాయకులకు తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని సవాల్ విసిరారు.తెలంగాణలో పండించిన పంటను కొనుగోలు చెయ్యాలని,కోనుగోలుపై స్పష్టమైన హామీ వచ్చే వరకు కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచేలా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం వైఖరి తెలిసే వరిసాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారని గుర్తు చేశారు.వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారని,వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు.

అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని,రాష్టాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అద్వాన్నంగా క్రిందికి పడిపోయిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశంలో తప్పినాయన్నారు.ఓ వైపు బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా,పార్టీగా రైతులకు వరి విషయంలో తాము చెప్పే ప్రయత్నం చేస్తే,వరి వేయాలని ధాన్యం కొంటామని,దుష్ట రాజకీయాలకు బిజెపి పాల్పడిందని మండిపడ్డారు.

మోసపూరితంగా కేంద్రంలో ఒకలా,రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బిజెపి దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మొదటినుండి వివక్షను చూపుతుందని మండిపడ్డారు.

ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతిని ఓర్వలేక బిజెపి నాయకులు అన్ని విషయాల్లో చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశానికి అన్నం పెట్టె రైతన్న కడుపుకొట్టే చట్టాలను బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్నదని మండిపడ్డారు.

దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఒక న్యాయం,తెలంగాణ రాస్ట్రానికి ఓ న్యాయమా అని నిలదీశారు.కొత్త రాష్ట్రమైన తెలంగాణలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు.

రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా పథకాల వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతుల పట్ల ఆయనకున్న ప్రేమను చూపారని అన్నారు,దేశంలో నాణ్యమైన,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని,రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.కరోనా సంక్షోభంలోను సంక్షేమాన్ని ఇచ్చిన ప్రభుత్వం టీఆరెస్ అని,తెలంగాణ రైతాంగం కేసీఆర్ పక్షానే ఉంటుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పంట మార్పిడికి సిద్ధమైందని చెప్పారు.

కేంద్ర బిజెపి నాయకులు ఓ మాట,రాష్ట్ర బిజెపి నాయకులు ఓ మాట మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.బిజెపి,కాంగ్రెస్ నాయకులవి దొంగ నాటకాలని,వారి ఆటలు తెలంగాణలో సాగవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీలు కవితా రాధారెడ్డి,చుండూరు వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంపటి పద్మా మధుసూదన్,రైతు సమన్వయ సమితి నాయకులు సుంకర అజయ్ కుమార్,దొడ్డ సురేష్ బాబు,కాసాని వెంకటేశ్వర్లు,అనంత సైదయ్య,ఏలూరి వెంకటేశ్వర్లు,గుండెల సూర్యనారాయణ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్ గౌడ్,అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు,కాసాని వెంకటేశ్వర్లు,తొగరు రమేష్,గింజుపల్లి రమేష్,కొండా సైదయ్య,పల్లా నర్సిరెడ్డి,టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరావు,టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ,టౌన్ మహిళా అధ్యక్షురాలు రోజా రమణి,కవిత,పట్టణ కౌన్సిలర్లు,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,పిఎసిఎస్ చైర్మన్ లు,వైస్ చైర్మన్ లు,మండల పార్టీ నాయకులు,టౌన్ పార్టీ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల నాయకులు,రైతులు,రైతు సంఘాల నాయకులు,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube