బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయండి

నల్లగొండ జిల్లా:జిల్లాలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని బీజేపి జిల్లా ఇంచార్జీ ఆర్.ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు.

 Make The Bjp Street Corner Meetings A Success ,bjp ,bjp Street Corner Meetings,-TeluguStop.com

గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో అయన పాల్గొని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శక్తి కేంద్రాల పరిధిలో ఉన్న బూత్ కమిటీలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు ఏర్పరచుకొని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాలను స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రజలకు వివరించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్,బండారు ప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు దాసొజు యాదగిరా చారి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి , దళిత మోర్చ నాయకులు పోతేపాక సాంబయ్య, నాగం వర్షిత్ రెడ్డి,పట్టణ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube