సూర్యాపేట జిల్లా:కర్ణాటక ( Karnataka )తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్న సిపిఎస్ ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ అన్నారు.కర్ణాటకలో సిపిఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడంతో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుందన్నారు.
కాంగ్రెస్ ( Congress , పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.