సూర్యాపేట జిల్లా:కోదాడ పెద్ద చెరువు కబ్జాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మునిసిపల్,రెవెన్యు,ఇరిగేషన్ అధికారులను కోదాడ ఆర్డిఓ ఎల్.కిషోర్ కుమార్ ఆదేశించారు.
కబ్జాలు చేసిన స్థలాలను వెంటనే స్వాధీన పనుచుకొని, కబ్జాదారులపై కేసులు పెడతామని ఆయన తెలిపారు.మునిసిపల్ చెత్తను రోడ్ల వెంట వేస్తే కేసులు బుక్ చేసి,వాహనాలు సీజ్ చేస్తామని సిబ్బందికి హెచ్చరిక చేసారు.
ఈ రోజు కబ్జా జరుగుతున్న 4 ప్రదేశాలను పరిశీలించి సంబందిత అధికారులకు తగిన సూచనలు చేశారు.చెరువు కబ్జాలపై స్పందించి విలువైన నీటి వనరులను కాపాడే ప్రయత్నం చేస్తున్న కోదాడ ఆర్డివో కిశోర్ కుమార్ గారికి ధన్యవాదములు తెలిపారు సామాజిక కార్యకర్త జలగం సుధీర్.