సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం ఈదులవాగుతండాలో తెలంగాణ ఉద్యమకారుడు బానోత్ బాలాజీని వైఎస్ షర్మిల పరామర్శించారు.రోడ్డు ప్రమాదానికి గురైన బాలాజీ, మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడినా మంచానికే పరిమతమయ్యాడు.
తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్ గా పని చేసిన బాలాజీ, అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,చచ్చిబ్రతికి జీవశ్చవంలా పడి ఉన్న బాలాజీని ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలెవరూ ఇటువైపు తిరిగి చూడలేదని కుటుంబ సభ్యులు,గ్రామస్థులు షర్మిల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా షర్మిల బాలాజీని ఓదార్చుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నుండి సర్పంచ్ వరకు అందరూ ఓట్లేయించుకొని,వదిలేసి వెళ్ళేవారని,అలంటి వారికి కార్యకర్తల బాధలు ఎలా తెలుస్తాయని అన్నారు.అధైర్య పడొద్దని,వైఎస్సార్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.