2022 సినిమా ఇండస్ట్రీ కి ఎంత బాగా కలిసొచ్చిందో అంతే బాగా నిరాశ కూడా ఇచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు.ఎందుకంటే విజయాలు అందుకున్న వారే 2022 మొదటి అర్ధ భాగం వచ్చేసరికి అపజయాలను సైతం మూటగట్టుకున్నారు.అలా 2022 లో అనుకోకుండా అపజయాల బాట పట్టిన నటీనటులు ఎవరో ఓసారి చూద్దాం.
రవి తేజ
క్రాక్ సినిమాతో ఫుల్ జోరుమీద ఉన్న రవితేజ కి ఖిలాడి సినిమా అంతగా కలిసి రాలేదనే చెప్పాలి ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి రవితేజకు భారీ పరాజయాన్ని ఇచ్చింది.
రష్మిక మందన
సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న రశ్మిక కి మార్చి లో విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానున్న సీతారామ సినిమాపైనే రష్మిక ఆశలు పెట్టుకుంది.
సూర్య

జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి హిట్ సినిమాల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈటి సినిమాతో డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో నటించిన విషయం కూడా మనకు తెలిసిందే.
పూజా హెగ్డే

గోల్డెన్ లెగ్ గా పేరున్న పూజా హెగ్డే కి గతంలో అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురం లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి 5 సినిమాలు ఘనవిజయం సాధించగా, 2022 వ సంవత్సరం లో రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య వంటి మూడు వరుస పరాజయాలు కూడా ఎదురయ్యాయి
వరుణ్ తేజ్
ఎఫ్2 , గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్ కి ఘని సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది అయితే ఆ తర్వాత వచ్చిన f3 పర్వాలేదనిపించింది.

చిరంజీవి, రామ్ చరణ్
ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవికి, అలాగే అర్ అర్ అర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కి ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి డిసప్పాయింట్ చేసింది.

నాని
శ్యాం సింగరాయ్ లాంటి అద్భుతమైన సినిమా లో నటించిన నాని కి జూన్ మాసం లో విడుదలైన అంటే సుందరానికి సినిమా నిరాశను మిగిల్చింది అనే చెప్పాలి.
సాయి పల్లవి
లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్ సినిమాలతో వరుస హిట్లు సాధించి జోరుమీద ఉన్న సాయి పల్లవి కి విరాటపర్వం రూపంలో పరాజయం ఎదురైందని చెప్పుకోవాలి
.






