సూర్యాపేట జిల్లా: జిల్లా పోలీసు శాఖలో భారీగా ఉద్యోగోన్నతులు రావడంతో పోలీసు కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది.65 మంది కానిస్టేుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగోన్నతి లభించగా ఇందులో నలుగురు మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు.జిల్లా పోలీసు కార్యాలయం నందు ఉద్యోగోన్నతులు పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ,అదనపు ఎస్పీ, డిఎస్పీలు వారికి శుభాకాంక్షలు తెలిపి,ఉత్తర్వుల పత్రాలు అందించి,హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి ధరింపజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి,డీజీపీకి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మరియు ఇతర అధికారులు,ఉద్యోగోన్నతులు పొందిన సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగోన్నతులు లభించడంతో జిల్లా పోలీసు సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసిందన్నారు.ఉద్యోగోన్నతితో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, సిబ్బంది కొత్త ఉత్సాహంతో పని చేయాలని అన్నారు.
సుదీర్ఘకాలం పని చేసి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు.బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, విధులు పెరుగుతాయి,బాధ్యతలు పెరుగుతాయి వాటికి అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు.
అందరూ ఉత్తమ సేవలు అందిస్తే పోలీసు శాఖకు మంచి పేరువస్తుందని,పని చేసే వద్ద అందరితో కలివిడిగా ఉండి అందరినీ సమన్వయం చేసుకుంటూ టీమ్ వర్క్ చేయాలని,మంచి సక్సెస్ కోసం కృషి చేయాలని సూచించారు.తోటి వారికి ఆదర్శంగా ఉండాలని,సాంకేతికత వైపు వెళుతున్న సమాజంలో మీరు వయస్సుతో పనిలేకుండా సాంకేతిక నైపుణ్యం సాధించాలని కోరారు.
అదనపు ఎస్పీ రితియాజ్ మాట్లాడుతూ చిరునవ్వు కలిగి ఉండి కుటుంబ సభ్యులతో అందంగా గడపాలని అన్నారు.వత్తిడి లేకుండా పని చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో డిఎస్పీలు రఘు, మోహన్ కుమార్,ఏఓ సురేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీకాంత్,జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్,ప్రమోషన్ పొందిన సిబ్బంది పాల్గొన్నారు.