గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు దంతాలను తెల్లగా కూడా మెరిపిస్తుంది.. ఎలా వాడాలంటే?

ఇటీవల రోజుల్లో గ్రీన్ టీ ప్రియులు భారీగా పెరుగుతున్నారు.హెల్త్ మరియు ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్న వారు తప్పకుండా తమ టైట్ లో గ్రీన్ టీ( Green tea ) ఉండేలా చూసుకుంటున్నారు.

 Try This Home Remedy For White And Shiny Teeth! Home Remedy, White Teeth, Shiny-TeluguStop.com

ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు నిర్వహణలో గ్రీన్ టీ ఉత్తమంగా తోడ్పడుతుంది.

అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ ను తగ్గించడంలో, బ్రెయిన్ ను షార్ప్ గా మార్చడంలో గ్రీన్ టీ స‌హాయ‌ప‌డుతుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు దంతాలను తెల్లగా మెరిపించడానికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

మరి ఇంతకీ దంతాలకు ( teeth )గ్రీన్ టీను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Green Tea, Tips, Healthy Teeth, Latest, Oral, Shiny Teeth, Remedywhite, W

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ), వన్ టేబుల్ వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )మరియు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్( Fresh lemon juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Green Tea, Tips, Healthy Teeth, Latest, Oral, Shiny Teeth, Remedywhite, W

ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే దంతాలపై పసుపు మరకలు తొలగిపోతాయి.దంతాలు తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.తెల్లటి మెరిసే దంతాలను కోరుకునే వారికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.దంతాల మధ్య ఇరుక్కుపోయిన క్రిములు నాశనం అవుతాయి.

నోటి నుంచి దుర్వాస‌న సైతం రాకుండా ఉంటుంది.చాలా మంది బ్యాడ్ బ్రీత్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

అలాంటి వారు కూడా ఈ రెమెడీని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube