వైరల్ వీడియో: వచ్చిన భక్తులకు నుదుట బొట్టు పెట్టి ఈ బుడ్డోడు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..

ప్రపంచం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగిన ఏదైనా వింత జరిగిన చాలు వెంటనే విషయం కాస్త ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

 Do You Know How Much This Buddo Is Earning By Putting A Blob On The Forehead Of-TeluguStop.com

ఈ వీడియోల వల్ల కొంతమంది రాత్రికి రాత్రే హీరోలు అయిపోతారు.ఇప్పటికే ఇలా చాలామంది హైదరాబాదులోని కుమారి ఆంటీ, ఢిల్లీలోని వడ పావ్ అమ్మాయి, నాగపూర్ లోని డాలి చాయ్ లాంటివారు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇలా అనేకమంది సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రముఖుల లిస్టులో చేరిపోతున్నారు.ఇక తాజాగా ఈ కేటగిరి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

అయోధ్యకు చెందిన గోలు( Golu of Ayodhya ) కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.ఇక ఈ వీడియో సంబంధించిన అసలు విషయం చూస్తే.

అయోధ్య నగరంలో నివసిస్తున్న గోలు అనే అబ్బాయి భారత దేశంలోని చాలామంది నిపుణుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఆ బాలుడి యొక్క ఆతవిశ్వాసం డబ్బులు సంపాదించే విధానం చూడదగినదని ఓ వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ద్వారా బాలుడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తెలిపాడు.అయోధ్య నగరానికి రామ మందిరాన్ని దర్శించేందుకు వచ్చిన అనేకమందికి భక్తుల నుదుటన తిలకంతో బొట్టు పెడుతున్న గోలు అతనికి కనిపించగా ఆ వ్యక్తి ఆ పిల్లాడిని రోజువారిని సంపాదన ఎంతో తెలుసుకొని ప్రయత్నం చేశాడు.

దీనికి సమాధానంగా గోలు చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు. ఉదయం పూట ఆరు గంటల నుంచి 10 గంటల వరకు నుదుట బొట్టు పెడుతూ, ఆపై రాత్రి 8 గంటల వరకు చందనం తిలకంగా పెట్టే పనిలో బిజీబిజీగా ఉంటానని చెబుతూ తాను రోజుకు సుమారు 1500 వరకు సంపాదించిస్తూన్నట్లు తెలిపాడు.ఇది విన్న అతడు దెబ్బకు ఆశ్చర్యపోయాడు.

దాంతో అతను గోలు జీతం డాక్టర్ సంపాదనతో సమానంగా ఉంది అంటూ తెలిపారు.అంతేకాదు ఆ సమయంలో ఆ చిన్నారి చెప్పే సమాధానం చాలా పవర్ఫుల్ గా ఉంది.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube