జి.కొత్తపెల్లి నుండి యధేచ్చగా ఇసుక రవాణా

తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం జి.కొత్తపెల్లి తానంచర్ల గుండా ప్రవహించే ఏరులో గత కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది.

 Illegal Sand Transport In Suryapet District, Suryapet District,illegal Sand, San-TeluguStop.com

రాత్రింబవళ్లు పదుల సంఖ్యలో టాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు.ముకుందాపురం,మద్దిరాల,ఎర్రబాడు,చిన్ననెమిలలో ఏకంగా పగలు కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తుంది.

ఇసుక అక్రమ రవాణా చేస్తూ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నా సంబంధిత వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా ఇసుక తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.

ఇసుకను పెద్ద మొత్తంలో తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.బోర్లలో నీరు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.అక్రమంగా తరలిస్తున్న ఇసుక నిర్వాహకులు దూర ప్రాంతాలకు తరలించి ఒక్కొక్క ట్రాక్టర్ కు రూ.4500 నుంచి, రూ.5000 వరకు అమ్ముతున్నట్లు సమాచారం.లైసెన్సులు లేని డ్రైవర్లు ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు ఎక్కువగా మైనర్లతోనే వాహనాలు నడిపిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్లకు నంబర్లు కూడా వేయడం లేదు.దీనికి తోడు రాత్రి వేళలో ఎక్కువ ట్రిప్పులు కొట్టాలన్న ఆశతో మద్యం మత్తులో చాలా వేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు.ఇంత జరుగుతున్న అధికారులు తనిఖీలు చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

నిఘా ఎక్కడ…?

ప్రతిరోజు పగలే ఇసుక ట్రాక్టర్లు స్థానిక మద్దిరాల ఎక్స్ రోడ్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహం ముందు నుంచి వెళ్తున్నాయి.చౌరస్తాలో సీసీ కెమెరాల్లో నమోదు అవుతున్నా కేసులు మాత్రం ఏ ఒక్క టాక్టర్ కు కూడా నమోదు చేయడం లేదు.

గస్తి కాసే పోలీసులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తూన్నారు.నడిచే ఇసుక ట్రాక్టర్ల నుంచి ఒక్కొక్క ట్రాక్టర్ కు ఒక్క నెలకు రూ.20వేల వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.కిందిస్థాయి సిబ్బంది ట్రాక్టర్ యజమానులకు అధికార సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఇసుక అక్రమ రవాణాకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికైనా అధికారులు ఇక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube