సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన వెంపటి రంజిత్ కుమార్ ఇప్పటికే 12 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.శనివారం కోదాడ అమృత హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వుప్పలవంచు కాంతమ్మకు చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరమైంది.
కాగా సమాచారం తెలుసుకున్న స్వర్ణ భారతి బ్లడ్ డోనర్స్ సభ్యుడు వెంపటి రంజిత్ కుమార్ రక్త దానం చేసి మహిళ ప్రాణాలు కాపాడాడు.రంజిత్ ఇప్పటి వరకు12 సార్లు రక్తదానం చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
రక్తదాతను ప్రత్యేకంగా అభినందించారు.