విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి:ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్

సూర్యాపేట జిల్లా: సమాజంలో విద్య పాత్ర చాలా ప్రముఖమైనదని, అన్ని వర్గాలకు విద్య అందినప్పుడు విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు( Konda Nageswara Rao ) అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోపి.

 Education Problems Need To Be Solved: Professor Konda Nageshwar-TeluguStop.com

డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా( Suryapet District ) కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పోలబోయిన కిరణ్ అధ్యక్షతన “కేసీఅర్ 9 ఏళ్ల పాలనలో విద్యారంగ పరిస్థితులు” అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ నేటి పాలకులు విద్యను బడుగు బలహీన వర్గాలకు అందనివ్వకుండా ప్రైవేట్, కార్పొరేట్ వశం చేస్తున్నారని తెలిపారు.పేద విద్యార్థులు చదువుకునే 9 వేల ప్రభుత్వ పాఠశాలలు నేడు మూతబడినవని,ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సమస్యలతో సతమతం అవుతున్నాయని,కనీసం టాయిలెట్స్ నిర్మించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

నేడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉస్మానియా,కాకతీయ, శాతవాహన,జేఎన్టీయూ లాంటివి నిధులు లేక వెంటిలేషన్ పై ఉన్నాయన్నారు./br

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యపై శ్రద్ధ లేదన్నారు.

ప్రవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేసిందన్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) వెంటనే స్పందించి రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల నిషేధించాలని,ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణకై నడుము కట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి ఎం.చందర్ రావు,జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి,డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, రహీం,గౌతమి,మనోజ్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube