సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల శివారులో ఎన్ హెచ్ 365 పై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో మిట్టగడపల మనోజ్ (16) అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.అన్నారం గ్రామానికి చెందిన మిట్టగడపల మనోజ్,మిట్టగడపల నవీన్,పాల్వాయి వెంకటేష్ తోపాటు మరో ఇద్దరు కలిసి మొత్తం ఐదుగురు ఏపీ20వై 9621 గల ఆటోలో తుంగతుర్తి వెళ్లి తమతమ పనులను ముగించుకొని రాత్రి 8:30 గంటల సమయంలో భారీ వర్షంలో తమ స్వగ్రామానికి బయల్దేరారు.అన్నారం క్రాస్ రోడ్ వద్ద హైదరాబాద్ నుండి మహబూబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంతో వచ్చి ఆటోను వెనక నుండి ఢీకొట్టగా కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పోయింది.ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జుకావడంతో ఆటోలో ఉన్న ఐదుగురు చెల్లాచెదురుగా పడి పోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న తుంగతుర్తి పోలీసులు గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.