సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దని, తాము నమ్మే నిన్నటి వరకు నిర్బంధంలో ఉన్నామని పాలకవీడు మండలంలో కారు దిగిన సర్పంచ్ లు అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా జెపిఎస్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని, ఉద్యమకారుల ఆశలు నిరుద్యోగుల కలలు నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు.
కేసీఅర్ ప్రవేశం పెట్టిన పథకాలన్నీ కూడా నెరవేరే పథకాలు కావన్నారు.రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందన్నారు.కాంగ్రెస్ కుటుంబం నుండి విడిపోయి తప్పు చేశామని, సాగర్ ప్రాజెక్ట్ కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.కనీసం రైతులకు నీళ్లు ఇవ్వలేని బీఆర్ఎస్ పై నమ్మకం ప్రజలకు పోయిందన్నారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్లు తప్ప మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవన్నారు.
కెనడా నుంచి వచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సమన్వయకర్తని నియమించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ప్రతిరోజు గ్రామాల్లో ప్రచారం చేయాలని,ప్రచార వాహనాలను ప్రతి గ్రామంలోకి వచ్చేలా చూస్తామన్నారు.
ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ మెజార్టీ ఇస్తున్నామని ఈఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త ఒసైనికుల పనిచేయాలన్నారు.అబద్దాలను ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి రైతులకు రుణమాఫీ ఎక్కడ ఇచ్చారో తేల్చాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని అభివృద్ధి చేసినమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేను గ్రామాల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.