సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సన్న వడ్లకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోందని,రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏమ్మార్వో నాయక్,ఎంపీడీఓ వెంకటేశ్వర్లు,ఏపీఎం అజయ్ నాయక్,ఆర్ఐ రంజిత్ రెడ్డి,మాజీ సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి,ఐకేపీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.