గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలి:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.గంజాయి రవాణా, సరఫరా,వినియోగం నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం కోదాడ సబ్ డివిజన్ పరిధి సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సమావేశం డిఎస్పీ కార్యాలయం నందునిర్వహించారు.

 There Should Be A Transformation In Ganja Users Sp Rahul Hegde , Sp Rahul Hegde-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్ల యందు నమోదైన గంజాయి (NDPS-నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కేసులపై సమీక్ష చేసి, గంజాయి కేసుల దర్యాప్తులో ప్రణాళిక పాటించాలని,అన్ని విషయాలను రికార్డ్ నందు నమోదు చేయాలి, నిందితుల యొక్క గుర్తింపు రికార్డ్ చేయాలని సూచించారు.కేసుల దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలపై సలహాలు, సూచనలు అందించారు.

గంజాయి రవాణా, సరఫరాను కట్టిడి చేయాలని,నిఘా పెంచండని ఆదేశించారు.గంజాయి వినియోగదారులను గుర్తించి వారిలో పరివర్తనకు చర్యలు తీసుకోవాలి,ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

గాంజా నిర్మూలనలో నిఘా లోపం లేకుండా పటిష్టంగా పని చేయాలని హెచ్చరించారు.యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనలో యువత పోలీసు వారికి సహకరించాలని,గంజాయి సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని, గంజాయి,డ్రగ్స్ వినియోగించి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు.

అనుకోకుండా మార్పు వచ్చే పిల్లలు,విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టి ఉంచి అలాంటి వారిని మంచి మార్గంలో నడిపించాలని కోరారు.గంజాయి వినియోగించే వారిలో మార్పు రావాలని, పరివర్తన రావాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని,గంజాయి,డ్రగ్స్ ను మానుకోని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని యువతను కోరారు.

ఈ సమావేశంలో సీఐలు రాము, వీరరాఘవులు, రామకృష్ణారెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube