లో బ్లడ్ ప్రెషర్ కి ముఖ్య కారణాలు

Important Causes Of Low BP

అతివృష్టి, అనావృష్టి … రెండూ ప్రమాదకరమే.అదేరకంగా హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ .

 Important Causes Of Low Bp-TeluguStop.com

రెండూ ప్రాణానికి ముప్పే.లో బిపి వలన ఏ పని సరిగా చేయలేం.

ఊరికే అలసిపోవడం, మూర్ఛపోవడం లాంటివి తరుచుగా జరుగుతుంటాయి.మరీ ఈ లో బీపి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా !

* మీరు రోజు తినే ఆహరంలో సరైన పోషకాలు, న్యూట్రెంట్స్ లేకపోతే లో బిపి వస్తుంది.

విటమిన్ B-12 మరియు ఫోలేట్ సరైన మోతాదులో శరీరానికి అందాలి.లేదంటే అవసరానికి తగ్గట్టుగా రెడ్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేయలేకపోతుంది శరీరం.

ఈ కారణంతో బిపి డౌన్ అయిపోతుంది.

* ఏదైనా తీవ్రమైన గాయం వలన రక్తం మరీ ఎక్కువగా బయటపడితే ప్రమాదం.

శరీరంలో సరిపడ రక్తం లేకపోవడంతో లో బీపి వస్తుంది.

* ఇంఫెక్షన్స్ శరీరానికి బలంగా తాకితే, దాన్ని సెప్టిసిమియా అని అంటారు.

ఇలాంటి పరిస్థితులలో బ్లడ్ ప్రెషర్ ప్రాణాంతకంగా డవున్ అయిపోతుంది.

* నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్నా, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది.

అందుకే నీళ్ళు బాగా తాగాలి.

* హైపోథైరాడిజమ్, హైపర్ థైరాడిజమ్ వంటి థైరాడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లో బిపి వస్తుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువున్నా, ఎక్కువున్నా బ్లడ్ ప్రెషర్ కి కష్టమే.

* బ్రాడికార్డియా లాంటి గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది.

* ఇక గర్భిణీ స్త్రీలకు కూడా లో బిపి సమస్యలు వస్తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube