సూరపల్లి మేజర్ వద్ద రైతుల ధర్నా

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి( Julakanti Ranga Reddy ), ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేజర్ కింది గ్రామాల రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.

 Farmers' Dharna At Surapalli Major, Surapalli, Rekha Krishnaiahchari, Ravi Teja-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ చెరువులను,బోర్లను నమ్ముకొని ఎడమ కాలువ కింద రైతులు 30 శాతం మంది వరి పంటలు వేశారని,నేడు అవి ఎండిపోయే దశలో ఉన్నాయన్నారు.రైతులు కష్టపడి ఎకరాకు రూ.25వేలు ఖర్చు పెట్టి ఉన్నారని,చెరువులు, బావులు,బోర్లు,కుంటలు పూర్తిగా ఎండిపోయి, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని ఈ సందర్భంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగునీటి కోసం,సాగునీటి కోసం నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని,ఎండిపోతున్న పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.రిజర్వాయర్లు నీటి నిలువ లేదని సాకుతో నీటి విడుదలను ప్రభుత్వం అలసత్వం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అనేకమంది అప్పులపలే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

గతంలో ప్రభుత్వాలు ప్రాజెక్టులో 505 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా రైతు సంఘం వత్తిడి తో రైతన్నకి తాగునీటి అందించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.ఎడమ కాలువ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లాలలో అనేక మంది రైతులు ఎన్నో ఆశలతో రబిలో వరి పంటలు సాగు చేస్తున్నారని వారబందిగానైనా ఒకసారి నీటిని విడుదల చేసి రైతన్న ఆదుకోవాలని చెప్పి,ముఖ్యమంత్రిని, భారీ నీటిపారుదల శాఖ మంత్రులను కలిసి వినతి పత్రం అందించామని, ప్రభుత్వంలో ఇప్పటికి కదలిక లేదని వెంటనే ప్రభుత్వ స్పందించి అధికారుల,స్థానిక ఎమ్మెల్యేల ద్వారా సమస్యలను గుర్తించి, పరిశీలించి నిర్ణయం తీసుకొని,నీటి విడుదల చేసి రైతులను, మూగజీవాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులో సరైన నీరు లేకపోతే ప్రాజెక్టు పైన ఉన్న ఆల్మట్టి నుంచి కర్ణాటక ప్రభుత్వం సంప్రదించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,కూన్ రెడ్డి నాగిరెడ్డి,కె.

వి.పి.ఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, కందుకూరు కోటేష్, కోమండ్ల గురువయ్య, నలబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్, కుంచెం శేఖర్,రైతులు రావుల ముసలయ్య, నరసింహ,జానపాటి సైదయ్య,సింగడిశెట్టి నాగయ్య,కొండేటి సైదయ్య,రావుల ఆంజనేయులు,కొండేటి నాగయ్య,రాయనబోయిన కృష్ణ,ఆవుల రామకృష్ణ, ఆవుల రామ్మూర్తి,రావుల రాంబాబు,రావుల సోమయ్య,రావుల ఉపేందర్,రావుల రాము, రావుల బాబు,రేఖ కృష్ణయ్యచారి,రవితేజ చింతకాయల అంజయ్య, తోట నారాయణ, చంద్రకంటి వెంకటయ్య, ఈర్ల కొండల్,కేశబోయిన మట్టయ్య,పిట్టల శివ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube