గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలి:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: గంజాయి వినియోగదారుల్లో పరివర్తన రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

గంజాయి రవాణా, సరఫరా,వినియోగం నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం కోదాడ సబ్ డివిజన్ పరిధి సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సమావేశం డిఎస్పీ కార్యాలయం నందునిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్ల యందు నమోదైన గంజాయి (NDPS-నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కేసులపై సమీక్ష చేసి, గంజాయి కేసుల దర్యాప్తులో ప్రణాళిక పాటించాలని,అన్ని విషయాలను రికార్డ్ నందు నమోదు చేయాలి, నిందితుల యొక్క గుర్తింపు రికార్డ్ చేయాలని సూచించారు.

కేసుల దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలపై సలహాలు, సూచనలు అందించారు.గంజాయి రవాణా, సరఫరాను కట్టిడి చేయాలని,నిఘా పెంచండని ఆదేశించారు.

గంజాయి వినియోగదారులను గుర్తించి వారిలో పరివర్తనకు చర్యలు తీసుకోవాలి,ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

గాంజా నిర్మూలనలో నిఘా లోపం లేకుండా పటిష్టంగా పని చేయాలని హెచ్చరించారు.యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనలో యువత పోలీసు వారికి సహకరించాలని,గంజాయి సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని, గంజాయి,డ్రగ్స్ వినియోగించి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు.

అనుకోకుండా మార్పు వచ్చే పిల్లలు,విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టి ఉంచి అలాంటి వారిని మంచి మార్గంలో నడిపించాలని కోరారు.

గంజాయి వినియోగించే వారిలో మార్పు రావాలని, పరివర్తన రావాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని,గంజాయి,డ్రగ్స్ ను మానుకోని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని యువతను కోరారు.

ఈ సమావేశంలో సీఐలు రాము, వీరరాఘవులు, రామకృష్ణారెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..!!