తెలుగు రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం...!

సూర్యాపేట జిల్లా: రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రాంరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు.

 Tdp Will Must Win In Telugu States Nathala Ramreddy, Tdp , Telugu States ,nathal-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మొట్టమొదటగా బీజం వేసి,అనేక కార్పొరేట్ వ్యాపార సంస్థలను రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు.

హైదరాబాద్ ఐటి రంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ముందుచూపే నిదర్శనమన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజల అభివృద్ధికి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి,పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో చివ్వెంల టీడీపీ మండల అధ్యక్షుడు ధరావత్ వెంకన్న నాయక్, పట్టణ అధ్యక్షుడు వెంకన్న, గోవిందా చారి,నాగయ్య, లింగయ్య,చంద్రశేఖర్ నాయుడు,తిరుమల గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube