24న ఖమ్మం లో నిరుద్యోగుల నిరసన దీక్ష..సంబాని చంద్ర శేఖర్ రావు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు సంబాని చంద్ర శేఖర్ రావు ఆరోపించారు.గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 On 24th, Unemployed People Will Start A Protest In Khammam..sambani Chandra Shek-TeluguStop.com

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు బదులు ఉద్యోగ అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శించారు.దీన్ని లీకేజీల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు.

నీళ్లు నిధులు నియామకాలు అనేవి తెలంగాణ ప్రజల ప్రధాన మైన ఆకాంక్ష అని వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో మోడీ అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను తన బినామీల అమ్మే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు.

ఈ ఏనిమిది ఏండ్ల కాలంలో ప్రజా సంక్షేమానికి ఇద్దరూ చేసింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.దేశ ఐక్యతకు రాహుల్ గాంధీ ఎంతో కష్ట పడుతుంటే ఆయనకు పెరుగుతున్న ఆదరణ బీజేపి కి మింగుడు పడటం లేదని ఎద్దేవ చేశారు.

ప్రజా ఆస్తులను దోస్తులకు ముట్ట జెప్పుతున్నవా మోడీ అని ప్రశ్నించి నందుకు రాహుల్ పార్లమెంట్ కు అనార్హుడుగా మిగిలి పోయాడని అన్నారు.

అయినా కాంగ్రెస్ ప్రశ్నించడం మానదని అన్నారు.

దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం కోసం ఈ నెల 24న ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమనికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్టు ఆయన తెలిపారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ప్రజా గొంతుక అని అన్నారు.

ప్రజా సమస్యలపై రెండు ప్రభుత్వాలపై గట్టి పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఎప్పుడూ ముందు ఉండి పోరాడుతుందని అన్నారు.

అందులో భాగంగానే 24 న ఖమ్మం పట్టణంలో నిరుద్యోగుల కోసం నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అభిమానులు , కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పీసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన హత్ సే హత్ యాత్ర స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల హత్ సే హత్ యాత్ర లు కాంగ్రెస్ నిర్వహిస్తోందని అన్నారు.ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది అని అన్నారు.

TPCC ఉపాధ్యక్షలు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష నుండి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకూ అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మే స్థాయికి చేరుకున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ని నిరసిస్తూ నిర్వహించనున్న నిరుధ్యోగ నిరసన దీక్ష ను విజయవంతం చేయాలని కోరారు.కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు,బైరు మనోహర్ రెడ్డి,మాలోత్ రాందాస్ నాయక్,నగర కార్యనిర్వాహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,జిల్లాINTUC అధ్యక్షులు కొత్తా సీతారాములు,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా ZPTC సంఘ అధ్యక్షులు బెల్లం శ్రీనివాసరావు, జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,జిల్లా sc సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్,దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,మాజీ కార్పొరేటర్ గంగాధర్ తిలక్,పల్లెబోయిన చంద్రం,మిక్కిలినేని నరేందర్,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్,తాల్లూరి హనుమంత రావు,కొట్టెముక్కల నాగేశ్వరావు,కొండ్రు కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube