మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు హస్తం గూటికి చేరనున్నారు.మే నెల మొదటివారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
కాగా మే 4 లేదా 5న సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దీక్షలోనే పొంగులేటి, జూపల్లికి ప్రియాంక గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం.
అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు.







