ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది.ఎన్నికలకు కేవలం 15 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈసారి గెలుపు కోసం ప్రధానపార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.
ఒకవైపు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీని నిలువరించే ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి.అయితే ఈ సారి ఎన్నికల్లో గెలవడం అధికార వైసీపీ( YCP ), ప్రతిపక్ష టిడిపి( TDP ), విపక్ష జనసేన ( Janasena )మూడు పార్టీలకు కూడా అత్యంత కీలకం.2019లో భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నా వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తుంది.అందుకే వైనాట్ 175 టార్గెట్ గా పెట్టుకుంది అయితే జగన్ ( jagan )ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలు కూడా జగన్ పాలనపై పెదవి విరుస్తున్న పరిస్థితి దాంతో గెలుపు కష్టమే అనే భావనకు సొంత పార్టీ నేతలే వచ్చినట్లు కనిపిస్తోంది.అయితే ఈ వ్యతిరేకతను అధిగమించి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అని నిరూపించాలంటే ఈసారి ఎన్నికల్లో గెలవడం ఎంతో కీలకం.మరోవైపు టీడీపీకి కూడా ఈ సారి ఎన్నికలు డూ ఆర్ డై లాంటివనే చెప్పాలి.ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
దానికి తోడు చంద్రబాబు ( Chandrababu )ఇవే తనకు చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించేశారు.దాంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ భవిష్యత్ ఆధారపడివుంది.

మరోవైపు జనసేన పరిస్థితి కూడా ఇంచు మించు పరిస్థితి ఇలాగే ఉంది.పార్టీ స్థాపించి పదేళ్ళు అయినప్పటికి పూర్తి స్థాయిలో బలమైన పార్టీగా ప్రజల్లో గుర్తింపు లేదు.గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు కైవసం చేసుకొని పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది.అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా ఆ ఎన్నికల్లో ఓటమిపాలు కావడం నిజంగా మింగుడు పడని విషయమే.
దాంతో ఈసారి ఎన్నికల్లో గచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.ఒకవేళ ఓడిపోతే జనసేన పార్టీని అందరు లైట్ తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు జనసేనను గుర్తించాలంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం.
మరి ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.







