కేసీఆర్ సర్కార్ జేబులునింపుతుంటే మోడీ సర్కార్ ఆ జేబులకు చిల్లులు పెడుతుంది:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:మోడీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.పెరిగిన వంట గ్యాస్, డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకే నంటూ ఆయన మండిపడ్డారు.

 If The Kcr Government Fills The Pockets, The Modi Government Will Fill Those Poc-TeluguStop.com

వంట గ్యాస్,డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా ఉద్యమించాలంటూ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యపేట పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు.మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యం.

జి రోడ్,తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుని అక్కడ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను మహిళలు దగ్దం చేశారు.అంతకు ముందు పెరిగిన వంట గ్యాస్,డీజిల్ ధరలను నిరాసిస్తూ ప్ల-కార్డుల ప్రదర్శనతో పాటు, ఖాలీ సిలిండర్ల ప్రదర్శనను నిర్వహించారు.

అనంతరం న కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద వంటా వార్పు నిర్వహించి,బిజెపి పాలనకు వ్యతిరేకంగా నినదించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మహిళల నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగించారు.

మహిళలు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోయాయని ఆయన దుయ్యబట్టారు.సంక్షేమ పథకాలతో ప్రజల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే అవే జేబులకు మోడీ ప్రభుత్వం చిల్లులు పెడుతుందంటూ ఎద్దేవా చేశారు.2000 రూపాయల ఆసరా ఫించన్,దివ్యంగులకు 3000,రైతుబంధు పేరుతో ఒక్కో రైతుకు సాలీన ఎకరాకు 10000 రూపాయల వ్యవసాయ పెట్టుబడులు అందిస్తుంటే,బిజెపి పాలకులు మాత్రం వంట గ్యాస్,డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందంటూ విమర్శించారు.అంతే గాకుండా పేదింటి ఆడపడచు పెళ్లికి సర్కార్ కట్నంగా లక్షా నూట పదహారు రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి/షాది ముబారక్ పధకం కింద అందించడమే కాకుండా,డెలివరీ ఆయిన మహిళలకు 12000/13000 అందిస్తూ పేదలను కాపాడుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వంట గ్యాస్,డీజిల్ ధరలను పెంచి వారి పొట్టకొడుతోందని ఆయన విరుచుకుపడ్డారు.

అటువంటి ప్రభుత్వాలకు కాలం చెల్లిందని ఆయన చెప్పుకొచ్చారు.పెరిగిన ధరలకు నిరసనగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి అంటూ టిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చిన కొద్దీ సమయంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మోడీ సర్కార్ పై మరో పోరుకు ఇన్ని వేలమంది ఉద్యుక్తులు కావడం మహిళలలో వెళ్లివిరిసిన చైతన్యానికి నిదర్శనమన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube