విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలం...!

సూర్యాపేట జిల్లా: విభజన హామీలు నెరవేర్చకుండా మోడీ ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ వచ్చారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)నేతలు విమర్శించారు.శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మోడీ గో బ్యాక్ అనే నినాదంతో మఠంపల్లి మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

 Cpi Leaders Protest Against Pm Modi In Suryapet District, Cpi Leaders Protest ,p-TeluguStop.com

అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ హామీలు అమలు చేయలేని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ సర్కార్ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తానని మాట ఇచ్చి నేటికీ ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని నిలదీశారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రూ.2000 సగానికి పైగా ఎగనామం పెట్టారని విమర్శించారు.అనేక కష్టనష్టాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసుకుంటే వాటిని ఆదాని, అంబానీలకు అమ్మి పెడుతూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వచ్చాడన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అమరారపు పున్నయ్య, సీనియర్ నాయకులు దాశరధి రామకృష్ణ, సన్నైగుడ్ల జాన్,మట్టయ్య, కోటిరెడ్డి,జాన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube