ఆ స్టార్ హీరో భార్యపై బాగా ఫైరైన చిరంజీవి.. ఇంతకు అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటుడుగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Megastar Chiranjeevi Fires On Tollywood Hero Wife,chiranjeevi,surekha,niharika,t-TeluguStop.com

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు పోటీగా నటిస్తూనే ఉన్నాడు.ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూనే ఉన్నాడు.చేస్తున్నాడు కూడా.

ఎప్పుడు కూడా నెగిటివిటీ( Negetivity ) ని తన దరికి చేరనివ్వలేదు.ఒకవేళ ఏవైనా కామెంట్లు వచ్చినా కూడా ఓపికగా ఉండేవాడు.

అటువంటి చిరంజీవి ఓపికను తప్పించేలా చేసింది ఒక స్టార్ హీరో భార్య.చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకునే చిరంజీవికి ఏకంగా రెట్టింపు కోపాన్ని తెప్పించింది ఆవిడ.

Telugu Chiranjeevi, Niharika, Surekha, Tollywood, Top-Movie

దీంతో చిరంజీవి తప్పనిసరిగా ఆమెపై ఫైర్ అవ్వాల్సి వచ్చింది.ఇంతకూ అసలు ఏం జరిగిందంటే.మామూలుగా చిరంజీవి భార్య సురేఖ( Surekha )కు కూడా ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది.మెగా వారి వారసురాలు అయిన ఆమెకు ప్రతి ఒక్కరూ మంచి అభిమానం చూపిస్తూ ఉంటారు.

అటువంటి సురేఖను ఆ స్టార్ హీరో భార్య బాగా టార్గెట్ చేసి కించపరిచినట్లు తెలిసింది.

ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా.సురేఖ కనిపిస్తే చాలు పదిమంది ఉన్నారని చూడకుండా ఘోరంగా అవమానించిందట.అలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.

కనిపించినప్పుడల్లా ఆమెను బాగా టార్గెట్ చేస్తూ ఉండేదట.గతంలో నిహారిక( Niharika ) పెళ్లిలో కూడా బాగా అవమానించే విధంగా మాట్లాడిందట.

అందరి హీరో భార్యలు బిజినెస్ చేస్తుంటే.చదువుకొని భర్తకు చేదోడు వాదాడుగా నిలుస్తూ ఉంటే సురేఖ మాత్రం భర్త తెచ్చిన సంపాదనతోనే బతుకుతుంది అని మనసుకు తగిలే విధంగా కామెంట్లు చేసిందట.

Telugu Chiranjeevi, Niharika, Surekha, Tollywood, Top-Movie

ఇక భార్యను అన్నేసి మాటలు అంటుంటే చిరంజీవి ఆమెపై ఫైర్ అయ్యాడని తెలిసింది.చదువుకుంటేనే సంస్కారం వస్తుందని అనుకోవడం లేదు సురేఖ లేకపోతే మెగా ఫ్యామిలీ( Mega Family ) లేదు.డబ్బుకి ఆమెకి ఎటువంటి కొదవలేదు.మంచి గుణం.మంచి టాలెంటెడ్ అన్నిటికన్నా ఓపిక సహనం ఎక్కువ అమ్మాయికైనా అబ్బాయి కైనా ఆ ఓపిక సహనమే ఉండాలి.అదే జీవితంలో మనల్ని ఎన్నో మెట్లు ఎక్కిస్తుంది.

Telugu Chiranjeevi, Niharika, Surekha, Tollywood, Top-Movie

నేను ఇన్ని మెట్లు ఎక్కిన ప్రతిసారి నా భార్య నా వెనకాలే ఉంది.మెగాస్టార్ నేనైతే నా భార్య కూడా మెగాస్టారే అని చిరంజీవి అదిరిపోయే సమాధానం ఇచ్చాడట ఆమెకు.దీంతో అప్పటి నుంచి మళ్లీ ఆమె ఎక్కడ కనిపించినా కూడా మౌనంగా ఉండేదట.అలా ఈ ఘటన గతంలో జరగగా అప్పట్లో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారిందని తెలిసింది.

ఆ స్టార్ హీరో ఎవరు.ఆయన భార్య ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube