తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 08 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05:55సూర్యాస్తమయం: సాయంత్రం 06:16రాహుకాలం: సా.03.26 నుంచి 5.00 వరకుఅమృత ఘడియలు: ఉ 07.25 నుంచి 08.13 వరకుదుర్ముహూర్తం: ఉ.08.23 నుంచి 09.11 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 8 Tuesday 2020-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి.ఈరోజు అంత మంచి రోజు కాదు కనుక ఖర్చులు తక్కువ అయ్యేలా చూసుకోండి.వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి.

వృషభం:

ఎవరైనా అప్పు కోసం వస్తే ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించండి.ఇంట్లో సమస్యలు ఎంతో తెలివిగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి.ఏదైనా ఆఫీస్ పనిని ఏకాగ్రతతో చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు.

మిథునం:

ఆర్ధికంగా మంచి లాభాలు ఉంటాయి.ఎవరితో అయినా కలిసి బిజినెస్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి.

చిన్న చిన్న సమస్యలు అన్ని తొలిగిపోయి ఆనందంగా ఉంటారు.వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.ఎందుకంటే మీతో పాటు ఉన్నవారు ఆర్ధికంగా సహాయం అందిస్తారు.

పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.చిరకాలం ఎదురుచూసిన పేరు, గుర్తింపు లభిస్తుంది.

సింహం:

ఈరోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.దయ, ప్రేమ నిండిన పనులను చెయ్యండి.

ఎవరైనా మిత్రులు అప్పు చెల్లించకుండా ఉంటారో వారికి కాస్త దూరంగా ఉండండి.కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

కన్య:

వ్యాపారం కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.మీ సన్నితుల నుంచి మీకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది.

వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి.అప్పుడే ఆనందంగా ఉండగలరు.

తులా:

గతంలో మీరు భవిష్యత్తు కోసం పెట్టిన డబ్బు ఇప్పుడు మీకు ఎంతో ఉపయోగపడుతుంది.కుటుంబం కోసం కష్ట పడి పని చేస్తే మంచి లాభాలు ఉంటాయి.మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ పొగిడి ఆనందపరుస్తారు.

వృశ్చికం:

శారీరకంగా కాస్త అలసటకు గురవుతారు.ఒత్తిడి ఎక్కువ అయ్యి ఇబ్బందులు పడుతారు.పనులు తగ్గించుకొని కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది.అత్తామామల నుంచి ఆర్ధిక లాభాలు పొందుతారు.మీ పిల్లల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించండి.

ధనస్సు:

ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను చూస్తారు.మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు.

మీ కుటుంబం మీకు అవసరమైన సపోర్ట్ అందిస్తారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మకరం:

మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే మంచి లాభాలు ఉంటాయి.ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన పనులను చేస్తారు.ఈరోజు అంత ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా గడుపుతారు.

కుంభం:

మీకు కొన్ని సమస్యలు వస్తాయి.కానీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.ముఖ్యమైన కొనుగోళ్లు చెయ్యాల్సి వస్తుంది.ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి వాటి నుంచి బయటపడతారు.

మీనం:

అనవసరమైన ఆర్ధిక లావాదేలలో ఇబ్బంది పడకుండా ఆనందంగా టెన్షన్ లేకుండా జీవించేందుకు ప్రయత్నించండి.కొన్ని కష్టాలు, నష్టాలు ఉన్నప్పటికి ఆర్ధికంగా ఇబ్బంది నుంచి బయటపడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube