అల్లు అర్జున్ - త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ ఆ జోనర్ లో ఉండనుందా?

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించు కున్నాడు.పుష్ప సినిమాతో( Pushpa ) నార్త్ ప్రేక్షకులను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు.

 Allu Arjun And Trivikram Srinivas Once Again Team Up Details, Pushpa The Rule, P-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు రెండవ పార్ట్ తెరకెక్కుతుంది.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా బన్నీ నెక్స్ట్ సినిమాను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు.

మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు.ఈ లోపులోనే అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ తో( Trivikram ) జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Guntur Kaaram, Mahesh Babu, Pushpa, Pushpa Rule, S

వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక వీరి కాంబోలో నాలుగవ సినిమా తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.ఈసారి ఈ క్రేజీ కాంబో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారని అంటున్నారు.

ఇందుకోసం త్రివిక్రమ్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసారని టాక్.

Telugu Allu Arjun, Alluarjun, Guntur Kaaram, Mahesh Babu, Pushpa, Pushpa Rule, S

ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం( Guntur Karam Movie ) పూర్తి అయ్యాక స్క్రిప్ట్ పనులు స్టార్ట్ చేయనున్నారట.ఇప్పటికే మూడు వరుస విజయాలు అందుకున్న కలయిక కాబట్టి ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.చూడాలి ఈ సినిమా ఎప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చి సెట్స్ మీదకు వెళుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube