అల్లు అర్జున్ – త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ ఆ జోనర్ లో ఉండనుందా?
TeluguStop.com
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించు కున్నాడు.
పుష్ప సినిమాతో( Pushpa ) నార్త్ ప్రేక్షకులను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు రెండవ పార్ట్ తెరకెక్కుతుంది.
పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా బన్నీ నెక్స్ట్ సినిమాను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు.
మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు.ఈ లోపులోనే అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ తో( Trivikram ) జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తుంది.
"""/" /
వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇక వీరి కాంబోలో నాలుగవ సినిమా తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఈసారి ఈ క్రేజీ కాంబో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారని అంటున్నారు.
ఇందుకోసం త్రివిక్రమ్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసారని టాక్. """/" /
ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం( Guntur Karam Movie ) పూర్తి అయ్యాక స్క్రిప్ట్ పనులు స్టార్ట్ చేయనున్నారట.
ఇప్పటికే మూడు వరుస విజయాలు అందుకున్న కలయిక కాబట్టి ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చి సెట్స్ మీదకు వెళుతుందో.
ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి.. వాటిని ఆపడం ఎలా..?