తిమ్మరుసుగా మారబోతున్న సత్యదేవ్

టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోలు అందరూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అంటూ రొటీన్ గా వెళ్లకుండా తమని కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడుగా బెస్ట్ అనిపించుకోవడంతో పాటు యూత్ లో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

 Satyadev Announce New Movie Name As A Timmarusu, Hero Satyadev, Tollywood, Young-TeluguStop.com

కేవలం స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు తప్ప ఎవరూ కూడా కమర్షియల్ కథలు కావాలి.పాటలు ఉండాలి, హీరో బిల్డప్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి అనే నియమం పెట్టుకోకుండా కథని నమ్ముకొని సినిమాలు చేస్తున్నారు.

తమ సినిమాలలో కథే హీరో అని, తాము ఆ కథని నడిపించే పాత్రధారులం మాత్రమే అని అంటున్నారు.క్రేజీ యంగ్ హీరోలుగా ఉన్న నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ నుంచి కొత్తగా వస్తున్న హీరోల వరకు అందరూ డిఫరెంట్ జోనర్ కథలతోనే వెళ్తున్నారు.
వీళ్లందరి మధ్య తనకి కూడా ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్న యువ నటుడు సత్యదేవ్.కేవలం తన నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఈ రోజు హీరోగా నిలబడేంత వరకు తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటూ వస్తున్నాడు.

జ్యోతిలక్ష్మి సత్యదేవ్ కెరియర్ కి హీరోగా టర్న్ ఇచ్చిన చిత్రం అయితే ఆ సినిమా కథ అంతా చార్మ్ చుట్టూ తిరగడం సత్యదేవ్ కి అనుకున్న స్థాయిలో ఇమేజ్ రాలేదు.అయితే బ్లఫ్ మాస్టర్ సినిమాతో తనలోని నటుడుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించి, తాజాగా రిలీజ్ అయినా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో హీరోగా సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సత్యదేవ్ మరోసరి విభిన్న కథాంశంతో తిమ్మరుసు టైటిల్ తో సినిమాని ప్రకటించాడు.టైటిల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక పోస్టర్ బట్టి చూస్తే ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.

మరో డిఫరెంట్ పాత్రతో రాబోతున్న ఈ సినిమా అతనికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube