మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు( Ancient temples and shrines ) ఉన్నాయి.దాదాపు ప్రతి గ్రామంలో కూడా కచ్చితంగా ఒక దేవాలయం ఉంటుంది.
దేవుడు ఉన్నాడని నమ్మకంతో అందరూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు.ప్రతిరోజు పూజలు చేస్తుంటారు.
ఒక్కొక్కసారి దేవుడు తన భక్తులకు అద్భుతలను చూపిస్తూ ఉంటాడు.లక్షల సంఖ్యలో దేవాలయాలు ఉన్న కొన్ని దేవాలయాలు మాత్రం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
అక్కడ కొలువై ఉన్న దేవుడు ఎంతో మహిళా గలవారని భక్తులు నమ్ముతారు.బీహార్( Bihar ) లోని పుర్నియా జిల్లాలో కూడా అలాంటి అద్భుతమైన ఆలయం ఒకటి ఉంది.
అదే మాత శీతల మందిరం( Mata Shithala temple ).పూర్నియా జిల్లా బిల్లోరిలోని శ్రీకృష్ణ పూరి వార్డ్ నెంబర్ 44 లో ఈ దేవాలయం ఉంది.ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే తట్టు, ఎస్ఎస్‌డీ లాంటి రోగాలు తగ్గిపోతాయని భక్తులు విదేశాల నుంచి కూడా వస్తున్నారు.
మాత శీతల మందిర కమిటీ అధ్యక్షుడు ప్రమోద్ దేవనాథ్( Pramod Devnath ) మాట్లాడుతూ 1948లో మాత శీతల మందిరం నిర్మించారని వెల్లడించారు.ఈ దేవాలయం పూర్నియా సీమాంచల్ ప్రాంతాలలో వేలాదిమంది ప్రజలు తట్టు, మహమ్మారితో ఇబ్బంది పడినప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించారని ఆయన చెప్పారు.ఆ తర్వాత శీతల దేవి పూజ కోసం స్థానిక నివాసి రోహిణి కవిరాజ్ ద్వారా పిలుపు వచ్చిందని వెల్లడించారు.
స్థానికులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తమకున్న తట్టు వ్యాధి తగ్గిపోయిందని వెల్లడించారు.అందుకే అప్పటినుంచి ఈ దేవాలయానికి మశూచితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఎంతోమంది వస్తున్నారని ఆయన చెప్పారు.అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారి రోగాలు తగ్గుతున్నాయని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే బీహార్, యూపీ తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది భక్తులు శీతల పూజ ఉత్సవాన్ని వీక్షించేందుకు వస్తూ ఉంటారు.
అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను తీర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు.
DEVOTIONAL