ఈ పుణ్య తీర్థంలో ఒక్క సారి స్నానం చేస్తే.. బ్రహ్మ సిద్ధాంత జ్ఞానం..

ఇలవైకుంఠంగా పిలిచే ఏడుకొండలలో పురాణ ప్రాశస్త్యం ఉన్న తీర్థాలు ఎన్నో ఉన్నాయి.ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడి గురించి ఎంత విన్నా తనివి తీరదని భక్తులు చెబుతూ ఉంటారు.

 Sankasanandana Teertham In Sheshachalamforest , Punya Tirtham, Tirumala , Dev-TeluguStop.com

లోక కళ్యాణార్థం వైకుంఠంలో విడి భువిపై వెలసిన మహావిష్ణువు నడయాడిన పుణ్యస్థలంలో మూడు లక్షలకు పైగా తీర్థాలు ఉన్నాయి.

ఇందులో రామకృష్ణ తీర్థం, పాండవ తీర్థం, పాప వినాశనం, కుమారధారా తీర్థం, తుంబురతీర్ధం, చక్ర పుణ్యాతీర్థం, సనక సనందన తీర్థం, వంటివి ఎంతో ముఖ్యమైనవిగా చెబుతున్నారు.

సనకసనందన తీర్థం తిరుమల పుణ్యక్షేత్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.అసలు సనకసనంద తీర్థం సందర్శిస్తే కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Andhra Pradesh, Devotional, Mahavishnu, Sheshachalamest, Tirumala-Latest

శేషశలం కొండలలో కొలువై ఉన్న తీర్థాలలో సనకసనందన తీర్థం ప్రాముఖ్యత కలిగిన తీర్థం అని వేద పండితులు చెబుతున్నారు.మానవ సృష్టి కొరకు బ్రహ్మ దేవుడు చేత సృష్టించబడిన బ్రహ్మ మానస పుత్రులు స్వయంగా తపస్సు ఆచరించిన ప్రదేశమే సనకాసనంద తీర్థం.ఒకరోజు బ్రహ్మ మానస పుత్రులిద్దరు విష్ణువుని దర్శించుకొనుటకు వైకుంఠముకు వెళ్ళగా ద్వార పాలకులైన జయ విజయులు వారిని విష్ణు దర్శనానికి నిరాకరిస్తారు.

Telugu Andhra Pradesh, Devotional, Mahavishnu, Sheshachalamest, Tirumala-Latest

దీని వల్ల ఆగ్రహించిన బ్రహ్మ మానస పుత్రులు జయ విజయులను దైవత్వం కోల్పోయి భూలోకమున జన్మించునట్లు శపిస్తారు.జయ విజయులు శాపము తొలగించామని విష్ణు ప్రాధేయపడగా విష్ణుకు శత్రువుగా మూడు జన్మలు జన్మించడం, ఏడు జన్మలు విష్ణుకు భక్తులుగా జన్మించడం మాత్రమే మార్గం ఉందని సెలవు ఇవ్వడంతో జయ విజయులు ఇద్దరు త్వరగా విష్ణు సన్నిద్యం చేరుకోవాలంటే మూడు జన్మలుగా పుట్టిన పర్వాలేదు అని తెలిసి మూడు జన్మలలోను తమ విష్ణువు చేతిలోనే మరణమును పొందినట్లు కూడా వరాన్ని పొందుతారు.విష్ణు దర్శనం కోసం శేషాచలం కొండల్లోని గృహలో ఘోర తపస్సు చేసి విష్ణు సత్కారం పొందారు.

అప్పటి ఆనవాళ్లు నేటికీ సనక సనందన తీర్థంలో కనిపిస్తూ ఉండడం విశేషం.సనకసనందన తీర్థములో మార్గశిక శుక్లపక్ష ద్వాదశి నాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube