చాలా మంది ప్రజలు ఏ పని చేయాలన్నా వారికి చెడు జరుగుతూనే ఉంటే మీ ఇంట్లో ఇలాంటి ఫోటోలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి.వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఫోటోలు ఎక్కడ పెట్టాలో, ఎలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
రాక్షసులను చంపే దేవత ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు.అన్నిటికంటే ముందు ఏదైనా దేవత వరం లేదా అభయం ఇస్తున్నట్లు ఉండే ఫోటోలు కూడా ఫోటోను పెట్టుకోవచ్చు.
అటువంటి ఫోటోలు ఇంట్లో శాంతిని కలిగిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.ఇంట్లో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసే బొమ్మను ఉంచడం మంచిదే అలాంటి చిత్రాన్ని పెట్టడం వల్ల మనసులో మంచి అనుభూతి కలిగే అవకాశం ఉంది.
హనుమంతుని అనుగ్రహం ఆ ఇంటి పై ఎప్పుడు ఉంటుంది.కోపంతో ఉన్న హనుమంతుని విగ్రహాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.
దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే శ్రీరాముడిని మోస్తున్న హనుమంతుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు.
ఎందుకంటే హనుమంతుడు అస్థిర భంగిమలో ఉన్నాడు.అది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కీడు జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నటరాజ రూపంలో ఉన్న శివుని విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు.ఎందుకంటే ఈ రూపంలో ఉన్న శివుడు చాలా కోపంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతూ చెబుతున్నారు.ఇంటి పూజ గదిలో శివలింగాన్ని ఎప్పుడు ప్రతిష్టించకూడదు.మరోచోట ఉంచవచ్చు.ఇంకా చెప్పాలంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే చిత్రాలను, విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది.వాటిని చూస్తున్నప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులపై కూడా సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
శ్రీకృష్ణుని బాలరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభం.